Current bills are in fire
రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లుల్లో మోత మోగిపోతుంది. ఒకవైపు జీఎస్టీ, మరోవైపు డెవలప్‌మెంట్ ఛార్జీల పేరిట వినయోగదారులను పిండేస్తున్నారు. డిస్కంలు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి వీలుగా డెవల్‌పమెంట్ చార్జీల (డీసీ)ను ప్రతిపాదిస్తున్నాయి. దాంతో పాటు 2017 జూలై 1 తర్వాత కనెక్షన్లు పొందిన 10లక్షల మంది జీఎస్టీని కట్టాలని తాఖీదులు పంపుతున్నారు. వారందరికీ కనెక్షన్ తీసుకున్న నాటి నుంచి కట్టిన డీసీలపై 18 శాతం జీఎస్టీని కలిపి బిల్లులో మోగిస్తున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచే దాన్ని వర్తింపజేసి ఉంటే ప్రస్తుతం డీసీ భారం ఒక్కటే ఉండేది.
సమాచారం లేకుండా కేవలం రీడింగ్‌లతోనే జీఎస్టీ అమలు చేస్తుండడంతో ఈ బిల్లులేంటో తెలియక వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఎస్పీడీసీఎల్ పరిధిలో వినియోగదారులందరి వాడకానికి సంబంధించిన సమాచారం సేకరించి.. ఆ మేర పెరిగిన లోడుపై డీసీ వసూలు చేయాలని యంత్రాంగం ఆదేశాలు ఇచ్చింది. దాంతో క్షేత్రస్థాయిలో ఏఈల నేతృత్వంలోని బృందాలు తనిఖీలు చేసి బిల్లును వడ్డిస్తున్నాయి. 1 కిలోవాట్ వాడకానికే ఒప్పందం చేసుకున్న వినియోగదారులంతా పెరిగిన లోడును అనుసరించి కిలోవాట్‌కు రూ.1425 (రూ.1200 డీసీ) చొప్పున అదనంగా కట్టాల్సి వస్తోంది. జీఎస్టీ చెల్లిచడమనేది పాత పద్ధతే అయినప్పటికీ అదనంగా డెవలప్‌మెంట్ ఛార్జీలు చేరడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
For More Click Here