పంజాగుట్ట ఏసీపీ కార్యాలయంలో చెట్లు నరికివేత

తెలంగాణ ప్రభుత్వం హరిత హారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ హరిత తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తుండగా పంజాగుట్ట ప్రధాన రహదారికి పక్కనే ఉన్న పంజాగుట్ట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో చెట్లను నరికి వేయడం విడ్డూరంగా మారింది.

సుమారు 30 ఏళ్లకు పై పడ్డ భారీ వృక్షాలను నేలమట్టం చేశారు‌. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారుల బృందం ఏసీపీ కార్యాలయానికి వచ్చి వివరాలు సేకరించారు. భారీ వృక్షానికి సంబంధించిన చెట్టు కొమ్మలు విరిగి పడుతుండడంతో వాటిని తొలగించాలని ఆదేశించానని క్రింది స్థాయి సిబ్బంది మరోలా అర్థం చేసుకొని చెట్లను పూర్తిగా తొలగించి ఉండవచ్చునని ఏసిపి చెప్పడం ఫారెస్ట్ అధికారులను ఒక్కింత విస్మయానికి గురిచేసింది. దీంతో పూర్తిస్థాయిలో విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని ఫారెస్ట్ అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article