ఎనీ డెస్క్ తో ఎప్పుడైనా దోచేస్తారు

CYBER CRIME WITH ANY DESK

  • యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో మోసాలు
  • జాగ్రత్తగా ఉండాలని ఆర్ బీఐ హెచ్చరిక

స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎంతగా పెరుగుతుందో, సైబర్ నేరాలు కూడా అంతే స్మార్ట్ గా పెరుగుతున్నాయి. మనం సరదాగా డౌన్ లోడ్ చేసుకునే యాప్స్ ద్వారా మాల్ వేర్ పంపించి మన బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత అంశాలు తెలుసుకుని కొల్లగొట్టేస్తున్నారు. తాజాగా ఇలాంటి మోసాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) హెచ్చరికలు జారీచేసింది. ‘ఎనీ డెస్క్‌’ అనే ఓ మొబైల్‌ యాప్‌ ద్వారా ‘యునైటెడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌’ (యూపీఐ) ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థపై కొన్ని మోసాలు జరుగుతున్నాయంటూ బ్యాంకులు, ఇతర ఆపరేటర్లను హెచ్చరించింది. ఆ యాప్‌ ద్వారా వినియోగదారుల ఫోన్లను ఆధీనంలోకి తీసుకొని వారి ఖాతాల్లోని డబ్బును దుండగులు మాయం చేస్తున్నట్లు గుర్తించామని ఆర్‌బీఐ సైబర్‌ భద్రత, ఐటీ పరిశోధన విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎనీ డెస్క్‌ యాప్‌లో ఉన్న లోపం లేదా దానిని పోలి ఉన్న మరో యాప్ ను సృష్టించడం ద్వారా ఈ తరహా మోసాలకు పాల్పడుతుండొచ్చని సైబర్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

CYBER CRIME

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article