సీపీ చెప్పినా డీసీపీ పట్టించుకోలేదా?

సైబరాబాద్ మియపూర్ ఆల్విన్ చౌరస్తా లో డీసీపీ విజయ్ కుమార్ స్విగ్గి, జోమాటో వాళ్ళను ఆపివేశారు. దీంతో ఆయా ఫోటోల్ని తీయడానికి వెళ్లిన ఫోటో జర్నలిస్ట్ లను ’’ఇక్కడేం పని మీకు.. రోడ్డు అవతల నుండి తీయండ‘‘ని డీసీపీ విజయ్ కుమార్ వారించారు. ఈ విషయాన్ని ఫోటో జర్నలిస్టులు అక్కడే దగ్గర్లో ఉన్న సీపీ సజ్జనార్ కు చెప్పారు. అయినా, డీసీపీ విజయ్ కుమార్ పట్టించుకోలేదు. ‘‘మీకు పేపర్ లో యాడ్ లు ఇస్తారని వాళ్లకు సపోర్ట్ చేస్తారా… మా ఉద్యోగం మేము చేస్తున్నాం‘‘ అని ట్రాఫిక్ డీసీపీ విజయ్ అన్నారు. తర్వాత, ఫోటో జర్నలిస్టులను అక్కడ్నుంచి ఎస్ఓటీ పోలీసులు పక్కకు నెట్టివేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article