ఎన్.హెచ్.ఆర్.సి బృందానికి కీలక ఆధారాలు…

Cyberabad Police Presents Report To NHRC

దిశ అత్యాచారం, హత్య, ఆపై నిందితుల ఎన్కౌంటర్.. ఆ తర్వాత పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ ఘటన గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ బృందం అన్ని అంశాలపై క్షుణ్ణంగా విచారణ జరుపుతుంది. ఇప్పటికే  జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు అన్ని కోణాల్లోనూ, అందరినీ విచారిస్తున్నారు . ఇక తాజాగా పోలీసులతో కూడా మాట్లాడిన సభ్యులు పోలీసుల వద్ద నుండి కీలక ఆధారాలను తీసుకున్నారు. ఎన్ హెచ్ ఆర్ సి సభ్యుల బృందాన్ని కలిసి పోలీసులు దిశ హత్య కేసుకు సంబంధించి ఆమెపై అత్యాచారం  జరిగినట్టు, అలాగే హత్యను కూడా నిందితులే చేసినట్లుగా కీలక ఆధారాలు ఇచ్చారు. ఇక అంతే కాదు ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన నివేదికను, దిశ కాల్చివేత కు సంబంధించిన ఆధారాలతో సహా అన్ని ఆధారాలను సైబరాబాద్ పోలీసులు ఎన్ని చేసి బృందానికి ఇచ్చారు.

దిశ కేసులో కీలకంగా ఉన్న శాస్త్రీయ ఆధారాలు అన్నింటిని ఎన్ హెచ్ ఆర్ సి ముందు పెట్టిన సైబరాబాద్ పోలీసులు సంఘటనా స్థలంలో దొరికిన రక్తం మరకలను, లారీ క్యాబిన్లో దొరికిన రక్తం మరకలను కూడా సేకరించి జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు ముందుంచారు. ఘటనా స్థలం తో పాటు లారీ జరిగిన సీసీటీవీ ఫుటేజీని కమిషన్ ముందు ఉంచిన పోలీసులు, కొత్తూరు సమీపంలో నిందితులు కొన్న పెట్రోల్ తాలూకు సిసిటివి ఫుటేజ్ ను కూడా అందించారు. ఇక అంతే కాదు రక్తపు మరకల ఆధారంగా డీఎన్ఏ రిపోర్ట్ తో పాటుగా అన్ని నివేదికలను పోలీసులు ఎన్ హెచ్ ఆర్ సి సభ్యులకు ఇచ్చారు.

Cyberabad Police Presents Report To NHRC,NHRC,#CyberabadPolice, #DishaMurder,#Encounter,#KeyEvidences 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *