పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌ ఫోటోను వాడేసిన సైబరాబాద్ పోలీసులు

Cyberabad police using Pakistani captain Sarfaraz photo

వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భాగంగా భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన క్రికెట్ అభిమానులు పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఇప్పటికే అతడి కెప్టెన్సీని, పాక్ క్రికెటర్ల ఆటతీరుని విమర్శిస్తూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కూడా సర్ఫరాజ్ ఫోటోని వాడేసుకున్నారు. ఇటీవల జరిగన మ్యాచ్‌లో సర్ఫరాజ్ గట్టిగా ఆవలిస్తున్న ఫొటో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై ఎన్నో కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ ఫోటోని ఆధారంగా చేసుకుని సైబరాబాద్ పోలీసులు.. ”నిద్ర వస్తున్నా.. ఆపుకుని మరీ బలవంతంగా డ్రైవింగ్ చేయకండి. అది చాలా డేంజర్” అని కామెంట్ పెట్టారు. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ ఫోటో చూసి.. సైబరాబాద్ పోలీసుల సెన్సాఫ్ హ్యూమర్‌ని మెచ్చుకుంటున్నారు. సెభాష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article