cybergreens@maheshwaram
మహేశ్వరం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి ఎంతో స్కోప్ ఉంది. శంషాబాద్ విమానాశ్రయానికి చేరువగా ఉన్న ఈ ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా సులువుగా చేరుకోవచ్చు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీసంస్థలే కాకుండా.. మహేశ్వరంలో నలభై ఎకరాల్లో విప్రో సంస్థ సబ్బుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. దీని వల్ల మూడు వందల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. రావిర్యాల, మహేశ్వరం..ఈ రెండు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను సుమారు 950 ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్క మహేశ్వరం వద్ద 310 ఎకరాల్లో ఏర్పాటయ్యే ఈ క్లస్టర్ ద్వారా దాదాపు రూ.437 కోట్లతో అభివృద్ధి చేస్తారు. టాటా ఎయిరోస్పేస్ ఎస్ఈజెడ్ కూడా మహేశ్వరం చేరువలో ఏర్పాటైంది. ఇలాంటి అనేక డెవలప్‌మెంట్స్ వల్ల మహేశ్వరంలో స్థలం కొనుక్కుంటే బెస్ట్ అని చాలామంది భావిస్తున్నారు. అందుకే, హెడ్‌వే ప్రాపర్టీస్ సైబర్ గ్రీన్స్ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
సైబర్ గ్రీన్స్‌ను హెచ్ఎండీఏ అనుమతితో దాదాపు నలభై ఎకరాల్లో హెడ్ వే ప్రాపర్టీస్ డెవలప్ చేసింది. కేవలం పదిహేను నిమిషాల్లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈ ప్రాజెక్టుకు చేరుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ గేట్ పద్నాలుగు నుంచి జస్ట్ పది నిమిషాల్లో సైబర్ గ్రీన్స్‌లోకి అడుగుపెట్టొచ్చు. ఈ వెంచర్‌ను పూర్తిగా వాస్తుకు అనుగుణంగా డిజైన్ చేశారు. ఇందులో ల్యాండ్ స్కేప్‌కు పెద్దపీట వేశారు. చిల్డ్రన్ పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో ప్లాటు కొన్నవారు సెక్యూరిటీ గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఇరవై ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్‌హౌజ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్లు అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో చిన్న సైజు ప్లాట్లకు స్థానం కల్పించారు. ఇందులో వచ్చే మొత్తం ప్లాట్ల సంఖ్య.. దాదాపు 318. ఒక్కో ప్లాటు 240 గజాల సైజు నుంచి ప్రారంభమవుతుంది. 267, 400 గజాల్లో కూడా లభస్తుంది.