Daily target 170 villages promotional
జనసేన క్యాంపెయిన్ ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇక టిడిపి, వైసిపి లో వలసలు కొనసాగుతున్నాయి. అవేవీ పట్టించుకోకుండా జనసేన మాత్రం తనదైన స్టైల్లో ముందుకు వెళుతోంది. అందులో భాగంగా ప్రచార రథాలను ప్రారంభించి, గ్రామ గ్రామాన సభ్యత్వ నమోదు చేస్తూ వినూత్నంగా జనసేన ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా క్యాంపెయిన్ ముమ్మరం చేయడానికి సన్నద్ధమైంది. ప్రతిరోజు 170 గ్రామాల్లో ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ మేరకు ప్రచార రథాలను ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ఫోకస్ పెట్టాయి. టీడీపీ, వైసీపీలు రాజకీయ సమీకరణాల్లో లెక్కలు తేల్చుకుంటున్నాయి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ గూటి నుంచి ఈ గూటికి చేరేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఆ రెండు పార్టీల్లో జంపింగులు కొనసాగుతున్నాయి. అదలావుంటే జనసేన మాత్రం అందరికంటే ముందుగానే జనాల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమైంది. ఆ మేరకు హైటెక్ హంగులతో 17 ప్రచార రథాలు సిద్ధమయ్యాయి. మంగళగిరిలో సోమవారం నాడు పూజకార్యక్రమాలు నిర్వహించి ప్రచార రథాలను ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా అక్కడున్న కార్మికులకు గాజు గ్లాసుతో టీ అందించారు.ప్రచార రథాలతో క్యాంపెయిన్ గట్టిగా నిర్వహించాలనేది జనసేన లీడర్ల అంతరంగంగా కనిపిస్తోంది. 17 ప్రచార రథాలను ప్రతిరోజు రాష్ట్రమంతటా తిరిగేలా షెడ్యూలు చేస్తున్నారు జనసేన నేతలు. ఆయా గ్రామాల్లో పర్యటించే ప్రచార రథాలు నెమ్మదిగా వెళ్లేలా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఒక్కొక్క ప్రచార రథాన్ని 10 గ్రామాలకు మాత్రమే పరిమితం చేశారు. ఈ లెక్కన 17 రథాలు 10 చొప్పున 170 గ్రామాలను కవర్ చేయనున్నాయి. ప్రతిదాంట్లోనూ ఎల్‌ఈడీ టీవీ అమర్చారు. వీటి ద్వారా పవన్ కల్యాణ్ ప్రసంగాలను క్షేత్రస్థాయిలో జనాల్లోకి తీసుకెళ్లనున్నారు.జనసేన పార్టీ గుర్తైన గాజు గ్లాసును జనాల్లో ప్రమోట్ చేసేలా ప్రచార రథాలు రూపొందించారు. అంతేకాదు ఆయా గ్రామాల్లో పర్యటించే సందర్భంగా.. ప్రచార రథాల దగ్గర గాజు గ్లాసుతో ఛాయ్ అందివ్వనున్నారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. మొత్తానికి ప్రధాన పార్టీలకు దీటుగా దూసుకెళ్లాలని డిసైడయిన జనసేనాని.. ప్రచార పర్వంలో ముందు వరుసలో నిలిచారు .
Check Out Latest Offers in Amazon
For more Filmy News