డీఏపీ ఎరువులపై 140% సబ్సిడీ పెంపుదల

76

DAP FERTILIZERS SUBSIDY 140% INCREASED

దేశంలో ఎరువుల ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. డీఏపీ ఎరువులపై సబ్సిడీ 140% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో డీఏపీ సంచికి రూ.500 గా ఉన్న సబ్సిడీని రూ.1200 కు పెంచారు. ఈ సబ్సిడీ కోసం రూ.14,775 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అదనంగా ఖర్చు చేస్తుంది. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల ఉన్నప్పటికీ రైతు పాత రేట్ల వద్ద ఎరువులు పొందాలన్న ప్రధానమంత్రి. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here