చ‌మ్మీల‌ అంగీలేసి… నాని

dasara movie third song released

ఇక నుంచి ప్ర‌తి పెళ్లిళ్ల సీజ‌న్‌లో నా సినిమాలోని పాట వినిపించాల్సిందే అంటున్నాడు నాని. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ద‌స‌రా సినిమాలోని పెళ్లి పాట విడుద‌ల విష‌యాన్ని పంచుకుంటూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశాడు. ఈ నెల 8న దసరా సినిమాలోని థర్డ్ పాట విడుద‌ల‌వుతోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న దసరా చిత్రంలోని ‘చమ్కీలా అంగీలేసి’  అంటూ సాగే పాట జాన‌ప‌దం త‌ర‌హాలో సాగ‌నుంద‌ట‌. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్టర్‌లో నాని దసరా బుల్లోడుగా కనిపిస్తుండగా, కీర్తి సురేష్ చీరలో అందంగా కనిపించింది. లీడ్ పెయిర్ మ‌ధ్య అందమైన కెమిస్ట్రీని ఈ పాట
చూపించనున్నట్లు తెలుస్తోంది.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రాఫర్. ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు. దసరా చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article