తొలిసారి ఊర మాస్ పాత్రతో నాని చేసిన సినిమా… దసరా. ఈ నెల 30న
ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా ప్రచారం కోసం నాని దేశమంతా
తిరుగుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడులదవుతుండడమే
అందుకు కారణం. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
ఈసందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాల్ని ఆయన మీడియా అడిగిన పలు
ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు. ఆ విషయాలివీ…
@ మీరు చూపించిన విజువల్స్ కెజిఎఫ్. పుష్ప చిత్రాల వాతావరణం
కనిపిస్తుంది. మీ టార్గెట్ వారిని రీచ్ చేస్తుందా?
– మీరు ఎలా ఫీలవుతారో అలా ఫీల్ కావచ్చు. మాకు అసలు ఆ ఆలోచన లేదు కూడా.
@ పర్సనల్ గా ఛాలెంజ్‌గా ఈ సినిమాలో ఏమనిపించింది?
– దర్శకుడు చాలా క్లియర్ గా రాసుకున్నాడు. ఫిజికల్‌గా ఛాలెంజ్ ఫేస్
చేశాం తప్ప… పాత్ర పరంగా పూర్తి స్పష్టతతో నటించి న్యాయం
చేశాం.
@ ఈ సినిమా తర్వాత ఏ స్థాయిలో మీ కెరీర్ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పండి?
– ప్రేక్షకులు ఏం చేస్తే అది అవుతా. నేను ప్రాణం పెట్టి సినిమా చేశాను.
అది ఏ రేంజ్ అనేది భగవంతుడికి వదిలేస్తున్నా.
@ ప్రచారంలో భాగంగా అన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు? ఈ హైప్ ఎలా
అనిపిస్తుంది? మీ గట్ ఫీలింగ్ ఎలావుంది?
– ఇప్పుడు చెబితే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారేమో తెలియదు కానీ..
చెబుతున్నా. థియేటర్‌లో హిస్టీరియా క్రియేట్ చేస్తుందని చెప్పగలను.
@ ట్రైలర్‌లో ఇంపాక్ట్ వుంది. పాన్ ఇండియా సినిమా అని అందులో
తెలుస్తుంది. నటుడిగా ధరణి పాత్రలో మీరు పొందిన అనుభవం ఏమిటి?
– శ్రీకాంత్ కు తెలిసిన ప్రపంచమే ఈ సినిమా. మాకు కొత్త ప్రపంచాన్ని
చూపించాడు. ధరణి పాత్రతో నటనే కాకుండా… మిగతా కొన్ని విషయాలు పాత్ర
ద్వారా తెలుసుకున్నాను. తెలంగాణలోని వీర్లపలి ప్రాంతమంతా సెలబ్రేట్
చేసుకునే చిత్రమిది. ధరిణి పాత్ర నాకు చాలా నేర్పించింది.
@ పాన్ ఇండియాకు వెళ్ళే వారు ప్రూవ్డ్ దర్శకులు ద్వారా వెళ్ళారు. కానీ
మీరు కొత్త దర్శకుడితో వెళుతున్నారు. మీ అంచనా ఏమిటి?
– మేము ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం. పుష్ప ఐదు భాషల్లో విడుదల చేస్తే
ఒక బాషలో పెద్ద దర్శకుడు సుకుమార్. మిగిలిన నాలుగు భాషలకు పెద్దగా
తెలీదు. నాకు శ్రీకాంత్‌పై పూర్తి నమ్మకముంది.
@ రగ్గ్‌డ్ ఇమేజ్ ద్వారా దసరా పాన్ ఇండియా కు వెళ్ళడం కరెక్టేనా?
– ఇది వయెలెంట్ మాస్ రస్కీ ఫిలిం.
@ నాని.. గారూ.. ఇది పులిమీద స్వారీ లా ఉంది. తదుపరి సినిమా ఎలా వుండబోతోంది?
– ఓడిపోతామనేవాడికి పులిమీద స్వారీ. నాకు ఆ భయం లేదు. నాకూ ఏరోజు పలానా
కాపాడుకోవాలి అనేది లేదు. నాకు మనసుకు నచ్చింది చేసుకుంటూ పోతున్నా.
@ ఇందులో మేనరిజం కోసం ఎంత కష్టపడ్డారు?
– మేనరిజం అనేది సినిమా సినిమాకూ తేడా వుంటుంది. సాఫ్ట్ సినిమాలో
సాఫ్ట్‌గా వయెలెంట్ సినిమాకూ వయెలెంట్‌గా వుంటుంది.
@ నాని గారు 15 ఏళ్ళు కెరీర్ మీది పూర్తయింది. దర్శకుడిగా కొత్తవారికి
ఇవ్వడానికి కారణం?
– స్పెషల్ కారణం లేదు. కొత్తవారితో చేయాలనే రూల్ లేదు. అనుభవం వున్న
వారితోనూ చేశాను. టాలెంట్ కొత్తది పాతది కాదు. టాలెంట్ ఈజ్ టాలెంట్.
కొత్త తరం రావాలి. 2008లో నన్ను కొత్త అనుకుంటే నేను లేను. దేశమంతా
తెలుగు సినిమా చూస్తుందని మాకు తెలిసింది. తమిళ, కన్నడం, మలయాళంలో తెలుగు
సినిమా చూస్తున్నారని అర్థమయింది. నేను చెప్పిన డైలాగ్ లకు రెస్పాండ్
అవుతున్నారు.