చాటింగ్ చేసి రూ.70 లక్షలు పోగొట్టుకున్నాడు

డేటింగ్ యాప్ ల ద్వారా చాటింగ్ చేసిన ఓ 60 ఏళ్ల వైద్యుడు ఏకంగా రూ.70 లక్షలు పోగొట్టుకున్నాడు. ముషీరాబాద్ లో కుటుంబంతో కలిసి నివసించే 60 ఏళ్ల డాక్టర్.. గుజరాత్ లో వైద్యం చేస్తుంటాడు. నెలలో కొన్ని రోజులు గుజరాత్ లో, కొన్ని రోజులు హైదరాబాద్ లో ఉంటాడు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం ఓ డేటింగ్ యాప్ లో అమ్మాయి పరిచయమైంది. ఆమెతో రోజూ చాటింగ్ చేసేవాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ బాగా సన్నిహితులై నగ్నంగా వీడియో కాల్స్ కూడా చేసుకున్నారు. అయితే, ఆ వీడియో కాల్ రికార్డు చేసిన సదరు యువతి.. బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది.

దీంతో గతేడాది నవంబర్ లో దాదాపు రూ.39 లక్షల వరకు ఆ యువతికి చెల్లించుకున్నాడు. అయినా వదలకపోవడంతో చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇంత జరిగినా ఆయన చాటింగ్ మాత్రం మానలేదు. మళ్లీ డేటింగ్ యాప్స్ లో ఇతర అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. గత నెలలో మరో రూ.30 లక్షలు అలాగే ముట్టజెప్పినట్టు కనుగొన్నారు. దీంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి, ఆయన బ్యాంకు ఖాతా స్తంభింపచేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article