మరోసారి హస్తినకు సీఎం జగన్.. రీజన్ ఇదే

185
JAGAN WARNING TO LEADERS
JAGAN WARNING TO LEADERS
Day after CM YS Jagan visit to Delhi
ఏపీ సీఎం జగన్‌ రేపు మళ్ళీ ఢిల్లీ వెళ్లనున్నారు. కేవలం  రెండు రోజుల వ్యవధిలో రెండోసారి  ఆయన ఢిల్లీ వెళ్లనుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది . నిన్న ప్రధాని మోడీతో సమావేశమై రాష్ట్రానికి తిరిగివచ్చిన ఆయన అమిత్‌షాతో భేటీ అయ్యేందుకు రేపు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు సాయంత్రం ఆరు గంటలకు అమిత్‌షాతో జగన్‌ భేటీ కాబోతున్నారు. మండలి రద్దుతో పాటు ఏపీ అంశాలపై చర్చిస్తారని అంటున్నారు. నిజానికి ఆయన ఈరోజే అమిత్ షాను కలవాల్సి ఉన్నా ఆయన ఢిల్లీ ఫలితాలపై సమీక్షలో బిజీగా ఉండటంతో తిరిగి విజయవాడకు  వచ్చేశారు. అయితే  అపాయింట్‌మెంట్‌ను రీషెడ్యూల్ చేసిన కేంద్ర హోం శాఖ ఈరోజే సీఎం జగన్ కు కబురు పంపింది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు కేంద్ర హోం శాఖ ఆమోదం తప్పనిసరి కావడంతో భేటీలో అదే విషయం ప్రధానం అజెండా అని తెలిసింది. దాంతోపాటు మండలి రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం, ఏపీకి ప్రత్యేక హోదా, పెండింగ్ నిధుల విడుదల, సీబీఐ కేసుల విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అంశాలను కూడా జగన్ ప్రస్తావిస్తారని తెలుస్తుంది .

Day after CM YS Jagan visit to Delhi,cm jagan mohan reddy , andhra pradesh, delhi tour, amith shah , central home minister

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here