12.5 కోట్ల‌కు డీల్ ఫిక్స్

Spread the love
Deal FIX FOR Maharshi Movie 21.5 Crores
 
మ‌హేష్ సినిమా `మ‌హ‌ర్షి` ఓవ‌ర్‌సీస్ ఇంకా బిజినెస్ కాలేద‌ట‌గా?  కాలిపోయే ధ‌ర‌లు చెబితే ముట్టుకోవ‌డానికి ఎవ‌డు మాత్రం ముందుకొస్తాడు?  సినిమా హిట్ అయితే ఫ‌ర్వాలేదు. పోతే కొన్నోడు మున‌గాల్సిందే… వంటి మాట‌ల‌న్నీ ఈ మ‌ద్య కృష్ణాన‌గ‌ర్‌లో చాలానే వినిపించాయి. తాజాగా వాటికి అడ్డుప‌డ్డ‌ట్ట‌యింది. మ‌హేష్ మ‌హ‌ర్షిని 12.5కోట్ల‌కు ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్స్ తీసుకున్నారు. దాదాప 18 కోట్ల వ‌ర‌కు ధ‌ర‌లు ప‌లికినా నిర్మాత‌లు 12.5కోట్ల ద‌గ్గ‌ర డీల్ క్లోజ్ చేశారు. స‌రైన ప్ర‌ణాళిక‌, బుధ‌వారం ప్రీమియ‌ర్లు ప‌డి, మంచి బ‌జ్ తీసుకొచ్చుకోగ‌లిగితే మ‌హేష్ సినిమా కాబ‌ట్టి తొలి వారాంతానికి రెండు మిలియ‌న్లు క‌లెక్ట్ చేయ‌డం గ్యారంటీ అని డిస్ట్రిబ్యూట‌ర్ల న‌మ్మ‌కం. .👍గ‌తంలో మ‌హేష్ న‌టించిన `అత‌డు`, `పోకిరి`, `భ‌ర‌త్ అనే నేను` సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ ఈ సారి హ‌క్కుల‌ను చేజిక్కించుకుంది. వారు అనుకున్న‌ట్టే మ‌హేష్ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తాడా.. త‌న 25వ సినిమా ల్యాండ్ మార్కుగా నిల‌బెట్టుకుంటాడా వేచి చూడాల్సిందే. మ‌హేష్‌, న‌రేష్‌, పూజా హెగ్డే న‌టించిన ఈ సినిమా మే 9న విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *