Dean Jones No more
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్ గురువారం ఇకలేరు. గుండె పోటుకు గురై కన్నుమూశారు. 1961లో జన్మించిన ఈ క్రికెటర్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. టెస్టులు, వన్డే మ్యాచ్ ల్లో ఆస్ర్టేలియాకు ఎన్నో విజయాలను అందించాడు. టెస్టు క్రికెట్ లో ఎవరికి అందని విజయాలను సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్ లో ఎంత పేరుందో.. ఫీల్డింగ్ లోనూ అంతకన్నా పేరు సంపాదించాడు. క్రికెట్ కు గుడ్ బై చెప్పాకా.. కోచ్, కామెంటేటర్ గా అవతారమెత్తాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ల్లో భాగంగా బ్రాడ్‌కాస్టింగ్ కామెంటరీ చెబుతున్న జోన్స్ ముంబైలో ఉన్నారు. జోన్స్ ఆకస్మికంగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. 1984-1992 మధ్య కాలంలో ఆసీస్ తరఫున క్రికెట్ ఆడారు జోన్స్. టెస్టు క్రికెట్లో 3,631 పరుగుల్ని జోన్స్ సాధించగా, అందులో 11 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.