ఆ రాష్ట్రాల్లో ఎన్నార్సీ నో అని ప్రకటన చెయ్యండి ..

100
Declare no NRC
Declare no NRC

Declare no NRC in Congress-ruled states

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక మొదటి నుండీ దీనిని వ్యతిరేకిస్తున్న ఆర్జేడీ నేత ,రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఈ విషయంలో కీలక సూచన చేశారు. ప్రజా ఉద్యమంలో భాగస్వాములు అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, పార్టీలోని సీనియర్ సభ్యులతో కమ్యూనికేట్ చేయాలని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్‌ఆర్‌సి అమలు ఉండదని బహిరంగంగా ప్రకటించాలని ఆయన కాంగ్రెస్ నాయకుడిని కోరారు.
సిఎఎ, ఎన్‌ఆర్‌సిలకు వ్యతిరేకంగా పౌరుల ఉద్యమంలో చేరినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్‌ఆర్‌సి ఉండదని అధికారికంగా ప్రకటించడంపై మీరు కాంగ్రెస్‌ వర్గీయులను ఆకట్టుకుంటారని మేము ఆశిస్తున్నాము అని ప్రశాంత్ కిషోర్ మంగళవారం ట్వీట్ చేశారు. సిఎఎ మరియు ఎన్‌ఆర్‌సి రెండింటికి వ్యతిరేకంగా ఉద్యమించిన కిషోర్, ఎన్‌ఆర్‌సి అమలును నిలిపివేయడానికి కొన్ని సూచనలు కూడా చేశారు . బీజేపీయేతర రాష్ట్రాలన్నీ ఎన్‌ఆర్‌సికి నో చెప్పాలని ఆయన సూచించిన మార్గాలలో ఒకటి. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ విషయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నార్సీ అమలు చెయ్యమని ప్రకటన చెయ్యాలని  పేర్కొన్నారు. ఆ ప్రకటన చేసిన తర్వాత ప్రభావం ఎలా ఉంటుందో చూడండి అంటూ ఆయన రాహుల్ గాంధీకి సూచించారు.

Declare no NRC in Congress-ruled states,NRC, CAA, Prashanth kishore , RJD leader, congress leader, Rahul gandhi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here