DEEKSHITULU NO MORE
- షూటింగ్ లో ఉండగా గుండెపోటుతో తుదిశ్వాస
ప్రముఖ సినీ, రంగస్థల నటుడు, మురారి సినిమాలో పూజారి పాత్ర పోషించిన డీఎస్ దీక్షితులు కన్నమూశారు. సోమవారం ఓ సినిమా షూటింగ్ లో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే నాచారం ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన దీక్షితులు పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. 1956 జూలై 28న హనుమంతాచార్యులు, సత్యవతమ్మ దంపతులకు జన్మించిన ఈయన సంస్కత, తెలుగు భాషలలో రంగస్థల కళల్లో ఎం.ఏ డిగ్రీలు పొందారు. రంగస్థల నటుడిగా, అధ్యాపకుడిగా మంచి పేరు గడించారు. ఆల్ ఇండియా రేడియోలో నటుడిగా పలు నాటకాల్లో నటించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కిన మురారి చిత్రంలో దీక్షితులు నటించిన పూజరి పాత్ర ఆయన పేరు తెచ్చిపెట్టింది. ఇంద్ర, ఠాగూర్, అతడు, వర్షం తదితర విజయవంతమైన చిత్రాల్లో ఆయన నటించారు. దీక్షితులు మృతికి పలువురు సినీ, టీవీ నటులు సంతాపం తెలిపారు.