ర‌ణ‌వీర్‌తో పెళ్లైన తర్వాత దీపిక చిత్రం

Deepika Padukone pic after Marriage with Ranvir Sing
గత ఏడాది బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, హీరోయిన్ దీపికా పదుకొనె ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. అంతకు ముందు వీరివురూ కొన్ని సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు. అది కూడా ఓ బయోపిక్‌లో. 1983 వరల్డ్ కప్‌లో భారత పతాకను ఎగరేసిన ఇండియన్ టీం కెప్టెన్ కపిల్ దేవ్ ఆయన టీం.. వరల్డ్ కప్ ప్రయాణాన్ని సినిమా రూపంలో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందులో కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ నటిస్తున్నారు. కాగా కపిల్ దేవ్ సతీమణి రోమీ భాటియా పాత్రలో దీపికా పదుకొనెను నటింప చేయుడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ విషయంపై యూనిట్ దీపికను కూడా కలిసింది. ఆమె కూడా పాజిటివ్‌గానే స్పందించిందని వార్తలు వినపడుతున్నాయి. అంతా ఓకే అయితే రణవీర్ సింగ్, దీపికా పదుకొనె పెళ్లి అయిన తర్వాత నటించే తొలి చిత్రమిదే అవుతుంది.  కబీర్‌ఖాన్ దర్శకత్వంలో  రిలయన్స్, ఫాంటమ్, విబ్రీ మీడియా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article