Deepika Padukone EX Boy friend ,Singer Marraige
బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మాజీ ప్రేమికుడు నిహార్ పాండ్యా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. తఢాఖా, లింగ వంటి చిత్రాల్లో పాటలు పాడిన నీతిమోహన్తో నిహార్ పెళ్లి ఫిబ్రవరిలో జరగనుందని వార్తలు వినపడుతున్నాయి. వీరిద్దరూ నాలుగేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. దీపికా పదుకొనె ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో దీపికా ప్రేమికుడిగా నిహార్ పేరు ఎక్కువగా వినిపించింది. తర్వాత దీపికా స్టార్ హీరోయిన్గా మారింది. రణవీర్ సింగ్ను రీసెంట్గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సన్నిహితుల సమక్షంలోనే వీరి పెళ్లి జరగనుందని వార్తలు వస్తున్నాయి. నిహార్ పాండ్యా నటుడు.. మణికర్ణికలో కూడా ఆయన నటించారు.