ప్రభాస్ కోసం దీపిక మేటర్ టూ మచ్ గురూ..

27
sharukh with deepika
sharukh with deepika

deepika remuneration

అసలే కరోనా కారణంగా నిర్మాణ రంగం కుదేలయ్యింది. రాబోయే రోజుల్లో చిన్న సన్నా నిర్మాతలు కనిపించే పరిస్థితి ఉంటుందనుకోలేం. ఈ టైమ్ లో నిర్మాణ రంగంలో జాగ్రత్తలు తీసుకుని ఖర్చులు తగ్గించిన నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన సీనియర్ నిర్మాతలే ఏకంగా భారీ రెమ్యూనరేషన్స్ తో ఊదరగొడితే ఇతర హీరోలు, హీరోయిన్లు తమ రెమ్యూనరేషన్స్ ఎందుకు తగ్గించుకుంటారు. పైగా ఇప్పటి వరకూ తెలుగులో చేయని భామ కోసం ఓ మీడియం రేంజ్ హీరో సినిమాకు అయ్యేంత బడ్జెట్ ను రెమ్యూనరేషన్ గా ఇస్తే.. ఇక ఇండస్ట్రీ క్రైసిస్ లో ఉంది అంటే ఎవరు నమ్ముతారు. తాజాగా దీపికా పదుకోణ్ కోసం వైజయంతీ మూవీస్ బ్యానర్ ఇస్తోన్న రెమ్యూనరేషన్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం. ఓ రెండు మూడేళ్ల క్రితం వరకూ ఇప్పుడు మనం తెలుగులో టాప్ ఫైవ్ స్టార్స్ అనుకుంటోన్న వాళ్లు కూడా అంత రెమ్యూనరేషన్ తీసుకోలేదు. అలాంటిది దీపికా పదుకోణ్ కోసం అశ్వనీదత్ 25 కోట్లు రెమ్యూనరేషన్ గా ఇస్తున్నాడట. షాక్ అయ్యారా.. అవుతారు మరి. లేదంటే ఇప్పుడు దీపికకు నిజంగా అంత క్రేజ్ సౌత్ లో ఉందా అనే డౌట్ కూడా వస్తుంది కదా.

నిజమే.. ఇంకా చెబితే దీపికకు ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా మొన్నటి రేంజ్ తగ్గింది. కారణం తనకు పెళ్లైంది అని మాత్రమే కాదు.. అక్కడ ప్రస్తుతం కొత్తతరం భామలు హవా చేస్తున్నారు. ఝాన్వీ కపూర్, అలియాభట్, అనన్య పాండే, కియారా అద్వానీ బ్యూటీస్ హల్చల్ చేస్తున్నారు. వారిని తీసుకుంటే ఇందులో సగానికైనా ఓకే చెప్పేవారు. వారికే క్రేజ్ కూడా ఉంది. ఏదేమైనా దీపిక రెమ్యూనరేషన్ చూసి టాలీవుడ్ లో ఇతర నిర్మాణ సంస్థలు నోరళ్లబెడుతున్నాయి. ఎంత భారీ బడ్జెట్, హై కాన్వాస్ మూవీ అయినా.. ఈ రేంజ్ లో హీరోయిన్ కే రెమ్యూనరేషన్ ఇచ్చుకుంటూ వెళితే ఇంకమైనా ఉందా..? ఇంతకు ముందు కూడా స్టార్ ప్రొడ్యూసర్ అనిపించుకుని.. అప్పట్లో హాట్ బ్యూటీ అనిపించుకున్న ఇలియానాకు ఫస్ట్ టైమ్ కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చి నిర్మాణ రంగంతో ‘ఆట’ఆడుకున్న ఓ నిర్మాత ఇప్పుడు దిక్కులేకుండా అయిపోయి.. ‘డర్టీ’పిక్చర్స్ తీసుకుంటున్నాడన్న విషయం ఎవరూ మర్చిపోకపోతే మంచిది.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here