ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల…

153
Delhi Assembly Elections 2020
Delhi Assembly Elections 2020

Delhi Assembly Elections 2020 Dates

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల  నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనుండగా.. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 11న జరగనుంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 13,767 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కోసం 90 వేల మంది సిబ్బంది పని చేయనుండగా.. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. మొత్తం 1.46 కోట్ల ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఢిల్లీ సీఈఓ రణబీర్ సింగ్ ఈ మధ్యాహ్నం ఈ విషయాన్ని ప్రకటించారు. నగరంలో 80.56 లక్షల మంది పురుష ఓటర్లు.. 66.35 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారని ఆయన అన్నారు. గత ఏడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన అనంతరం ఈ నగరంలో జరుగుతున్న మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఇకపోతే గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో గెలుపొందింది. ఇక ఇప్పుడుఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 22తో ముగియనుంది. కాగా, నామినేషన్ల గడువు ఈ నెల 21తో ముగుస్తోంది.ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల నేపధ్యంలో ఆప్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతుంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నియమించుకుని ఎన్నికల సమరంలోకి వెళ్లనుంది.

Delhi Assembly Elections 2020 Dates,Delhi,Elections,Assembly elections,BJP,Congress,aam admi party,Election Commission, Schedule Release

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here