షాకింగ్ అన్సర్స్ ..పోలీసులపై హైకోర్టు ఫైర్

163
Delhi HC Fires On Delhi Police Answers
Delhi HC Fires On Delhi Police Answers

Delhi HC Fires On Delhi Police Answers

ఢిల్లీలో  అల్లర్లకు కారణం అయిన వారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి అరెస్ట్ చెయ్యాలని దాఖలైన పిటీషన్లపై ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది . ఆసక్తికరంగా సాగిన ఈ వాదనల్లో  బీజేపీ నేత కపిల్ మిశ్రా చేసిన రెచ్చగొట్టే, విద్వేష పూరిత ప్రసంగాల తాలూకు ఫుటేజీని తాము చూడలేదంటూ ఓ సీనియర్ పోలీసు అధికారి ఇఛ్చిన సమాధానంపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్. మురళీధర్ మండిపడ్డారు. అసలు మీరు ఈ ఫుటేజీని చూశారా అని ఆయన ప్రశ్నించినప్పుడు తాము చూడలేదని డీసీపీ క్రైం బ్రాంచ్  రాజేశ్ దేవ్ జవాబిచ్చారు. నేను ఇతర బీజేపీ నాయకులు  అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మల స్పీచ్ ల తాలూకు వీడియోలు చూశానని, కానీ కపిల్ మిశ్రా ఫుటేజీని చూడలేదని రాజేశ్ దేవ్ అన్నారు. దీంతో ఆ జడ్జి.. మీ పోలీసుల తీరు తనకెంతో ఆశ్చర్యంగా ఉందని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీ కమిషనర్ కార్యాలయంలో ఎన్నో టీవీలు ఉంటాయి కదా అన్నారు. కపిల్ మిశ్రా ప్రసంగ వీడియోను ప్లే చేయవలసిందిగా ఆయన కోర్టు సిబ్బందిని ఆదేశించారు.

కపిల్ ఎక్కడ, ఏ ప్రాంతంలో మాట్లాడారు.. ఆ సమయంలో ఎంతమంది పోలీసులు అక్కడ ఉన్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను న్యాయమూర్తి ప్రశ్నించగా.. తాను టీవీ చూడలేదని, న్యూస్ పేపర్లలో వఛ్చిన వార్తల ఆధారంగా సమాధానం ఇవ్వలేనని ఆయన  అన్నారు. ఈ సమాధానం పట్ల జస్టిస్ మురళీధర్ తీవ్రంగా స్పందిస్తూ.. ఈ విధమైన వార్తల పట్ల నిర్లక్ష్యం తగదని అన్నారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లకు కారకులైన వారిపై ఎఫ్ ఐ ఆర్ లు దాఖలు  చేసి, అరెస్టు చేయాలని  కోరుతూ ఫైల్ అయిన పిటిషన్లను న్యాయమూర్తులు మురళీధర్, తల్వంత్ సింగ్ విచారించిన సందర్భంగా ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. న్యాయమూర్తులు అడిగిన ప్రతి ప్రశ్నకూ వీరు తెలియదని చెప్పడం గమనార్హం

Delhi HC Fires On Delhi Police Answers,delhi high court, FIR , bjp leader, kapil mishra, CAA, NRC, NPR, Police,tsnews,political news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here