తెలంగాణా ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేత

203

తెలంగాణా, ఏపీ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాటిని తక్షణం అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించింది. కాగా తెలంగాణా, ఏపీల్లో కరోనా ప్రభావం ఎక్కువున్న సమయంలో, ఢిల్లీ ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. ఏ మార్గంలోనైనా ఢిల్లీకి వచ్చే వాళ్ళు RT-PCR నెగటివ్ రిపోర్టు తేవాలని మే 6 వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. రిపోర్ట్ లేకుంటే 14 రోజుల క్వారంటైన్ ఉండాలని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here