
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్
జిహెచ్ఎంసీ పరిధిలో డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నాయని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన కోఠిలో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలో మరోసారి ఫీవర్ సర్వే ప్రభుత్వం చేపడతామన్నారు. 12 వందలకు పైగా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యాయని వెల్లడించారు. వర్షకాలం ఆరంభమైంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందన్నారు. డెంగ్యూ కేసులు కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని.. 220 కొత్తగూడెం, ములుగులో 100కు పైగా మలేరియా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. డెంగ్యూ- మలేరియా వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. కోవిడ్ పూర్తిగా కంట్రోల్ కు వచ్చిందన్నారు. సెకండ్ వేవ్ ను పూర్తిగా కంట్రోల్ చేసుకున్నామన్నారు. ప్రభుత్వానికి సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.