కోట్ల చేరిక డిప్యూటీ సీఎం కేఈ కి తెలీదట

Deputy CM Dont Know Kotla Joining

ఏపీ కర్నూలు రాజకీయాల్లో రసవత్తర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పక్క పెద్ద ఎత్తున శ్రేణులతో కోట్ల తెలుగుదేశం పార్టీలో చేరాలని సన్నాహాలు చేస్తుంటే జిల్లాకు చెందిన నేత డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి మాత్రం ఆ విషయం తనకు తెలీదని చెప్పి సంచలనం సృష్టించారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో తన ఛాంబర్ లో సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం కేఈ విలేకరులతో మాట్లాడుతూ… కోట్ల ఫ్యామిలీ చేరిక విషయం సీఎం తనతో చర్చించలేదని, శ్రీశైలం ట్రస్టు బోర్డు ఏర్పాటు అంశం మాత్రమే చర్చించారని చెప్పారు. “కోట్ల చేరిక అంశాన్ని నా అంతట నేను సీఎం వద్ద ప్రస్తావించను, సీఎం ప్రస్తావించినప్పుడే కోట్ల ఫ్యామిలీ చేరికపై నా అభిప్రాయం చెబుతా” అని కేఈ కృష్ణమూర్తి అన్నారు. కోట్ల ఫ్యామిలి ఏమేం సీట్లు అడుగుతోందో తనకు తెలీదని కేఈ అన్నారు.
కర్నూలు జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. సోమవారం రాత్రి కోట్ల ఉండవల్లిలో సీఎం నివాసంలో డిన్నర్ కు కూడా వచ్చి వెళ్లారు. పార్టీలో చేరితే కోట్ల కర్నూలు లోకసభ, డోన్, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను ఆశిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కేఈ కోట్ల చేరిక అంశం తనకు తెలియదని చెప్పటం చర్చనీయాంశం అవుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article