డిప్యూటీ స్పీకర్ రేఖా నాయక్..

DEPUTY SPEAKER IS REKHA NAIK

బోలెడన్ని తర్జనభర్జనల తర్వాత, ఎవరికి వారు నాకొద్దు అంటూ స్పీకర్ పదవికి దూరంగా జరిగిన నేపథ్యంలో ఎట్టకేలకు స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరును ఫైనల్ చేసారు గులాబీ బాస్. అలాగే డిప్యూటీ స్పీకర్ గా రేఖా నాయక్ పేరును ఖరారు చేశారు.  దీనితో నామినేషన్లు దాఖలు చేసిన ఈ ఇరువురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారికంగా ఈ విషయాన్ని శుక్రవారం నాడు ప్రకటించనున్నారు. స్పీకర్ పదవికి గురువారం నోటిఫికేషన్ వెలువడింది. స్పీకర్ పదవికి పోటీ పెట్టకూడదని విపక్షాలను కేసీఆర్ కోరారు. అయితే ఈ పదవికి పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరును కేసీఆర్ ప్రతిపాదించారు.గురువారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్ గా రేఖా నాయక్ నామినేషన్ వేశారు. స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి కూడ రేఖా నాయక్ ఒక్కరే నామినేషన్ వేశారు. ఒక్క నామినేషన్లు తప్ప మరే ఇతర నామినేషన్ లు దాఖలు కాలేదు. నామినేషన్ దాఖలుకు సమయం కూడ మించిపోయింది. దీంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు ఒక్కొక్క నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి కాబట్టి దీంతో స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు నేడు శుక్రవారం శాసనసభలో అధికారికంగా ప్రకటించనున్నారు.ఇక డిప్యూటీ స్పీకర్ గా రేఖా నాయక్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలుస్తోంది.

TELANGANA NEW DEPUTY SPEAKER

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article