ఇంటర్ విద్యార్థిపై డిప్యూటీ వార్డెన్ దాడి

జగిత్యాల:జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మైనారిటీ గురుకుల కళాశాలలో ఘటన ఇది. డిప్యూటీ వార్డెన్ నయీం ఇంటర్ విద్యార్థిపై దాడి చేసాడు. డార్మేటరీ రూమ్ కు వెళ్లాడని…చెప్పినట్టు వినడం లేదని ఆగ్రహంతో ఇంటర్ విద్యార్థి రాజు ను కొట్టినట్లు సమాచారం. విద్యార్థిని కింద పడవేసి కాళ్ల తో తాన్నికుంటు పిడిగుద్దులు గుప్పించాడు. విద్యార్థి ప్రాధేయ పడిన నయీం కనికరించకుండా కొట్టాడు. విద్యార్థిని కొడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. విషయం తెలుసుకున్న ఆర్ ఎల్ సి (రీజినల్ లెవెల్ కోఆర్డినేటర్ )సయ్యద్ హమీద్ విచారణకు ఆదేశించారు. డిప్యూటీ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ కు ఆదేశాలు అందాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article