లైన్ ఆఫ్ కంట్రోల్ పొడువునా పాకిస్తాన్ రేంజర్లు దాడులకు పాల్పడ్డారు. మిలటరీ స్టేషన్లను ఇతర నగరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్స్, డ్రోన్లను ప్రయోగించారు. అయితే, భారత సైన్యం వారి ప్రయత్నాలను సమర్ధవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం కొడుతున్న దెబ్బలకు పాకిస్తాన్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ పెంపుడు కుక్కలైన టెర్రరిస్టులను సైన్యం ఏరిపారేస్తోంది. తాజాగా, ఇండియాలోకి చొరబడ్డానికి ప్రయత్నించిన ఏడుగురు టెర్రరిస్టులను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతం చేసింది. శుక్రవారం పాక్ రేంజర్ల సాయంతో 7 గురు టెర్రరిస్టులు జమ్మూకాశ్మీర్‌లోని సాంబ సెక్టార్‌లోకి చొరబడ్డానికి ప్రయత్నించారు. అలర్టైన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారిని కాల్చిపడేసింది.