స్ఫూర్తిదాయకం.. డెవాన్ కాన్వే

192

లార్డ్స్ లో అరంగ్రేటం మ్యాచులోనే సెంచరీ చేయడంతో న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ డెవాన్ కాన్వే.. ఒక్క సారిగా స్టార్ అయిపోయాడు. నిజానికి, అతని కథ తెలుసుకుంటే.. ఒక సూపర్ హిట్ స్పోర్ట్స్ కథా చిత్రానికి ఏమాత్రం తీసిపోదు. దక్షిణాఫ్రికాలో అతనో సగటు ఆటగాడు. అక్కడ అతని ఆస్తి అంతా అమ్మేసి న్యూజిలాండ్ లో స్థిరపడ్డాడు. ప్లేయర్-కోచ్‌గా పని చేస్తున్న అతనికి హఠాత్తుగా న్యూజిలాండ్ జట్టులో ఆడే అవకాశం లభించింది. అన్ని బ్యాటింగ్ ఫార్మాట్లలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అంతే, వెంటనే న్యూజిలాండ్ జాతీయ జట్టులో చోటు లభించింది. బుధవారం జరిగిన అరంగ్రేటం మ్యాచులోనే అదరగొట్టేశాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here