తిరుతిరుమలలో భక్తులు రద్దీ..దర్శనానికి 8 గంటల సమయం

అమరావతి :కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. నిన్న 71,119 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 37,256 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా స్వామివారి హుండీకి రూ. 3.91 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.రద్దీ కారణంగా తిరుమలలోని 24 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం ఉన్నారని వీరికి 8 గంటల్లో దర్శనం కానున్నదని వెల్లడించారు.కాగా శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వర్ణరథోత్సవం నాలుగు మాడ వీధుల్లో కన్నులపండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article