ధరణి తెలుగులో?

79
Dharani Portal In Telugu?
Dharani Portal In Telugu?

Dharani Portal In Telugu?

ధరణి పోర్టల్లో తెలుగు పేజీని ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే, ధరణి పోర్టల్ పై బుధవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ తెలంగాణ  నిపుణులతో చర్చలు జరిపారు. అందరి సౌకర్యం కోసం ఇంగ్లీష్ తోపాటు తెలుగులో కూడా ధరణి పోర్టల్ సేవలు అందించాలని ఆకాంక్షించారు. సామాన్యులకు అర్ధమయ్యే పదజాలంతో ఇంగ్లీష్ పదాల తర్జుమాకు నిపుణులు కృషి చేయాలన్నారు. ఇప్పటికే 90% పూర్తయిన ధరణి పోర్టల్ రూపకల్పన జరిగింది. కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా పరిశీలన. ధరణి వెబ్ సైట్ పై అవగాహన కల్పించే క్రమంలో అధికారులకు శిక్షణ కొనసాగుతున్నది.  దసరా వరకు అంతా సిద్ధం కాగా లాంచింగ్ తేదీని సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారని సమాచారం.

Dharani Portal Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here