ధరణీ స్లాట్ లు రిషెడ్యూల్

రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబందనల వలన ఈ నెల 12.05.2021 నుండి 21.05.2021 తేది వరకు మండల కార్యాలయాలలో జాయింట్ సబ్ రిజిస్టార్ లుగా వ్యవహరిస్తున్న తహసిల్ దార్ల వద్ద ధరణీ ద్వారా నిర్వహించే భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలు జరుగవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి/సి.సి.ఎల్.ఎ శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. అయితే ధరణీ లో ఈ నెల 12.05.2021 నుండి 21.05.2021 తేదిలలో రిజిస్ట్రేషన్ లకు ధరణీ ద్వారా స్లాట్ లు బుక్ చేసుకున్న వారి స్లాట్లను రిషెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు. స్లాట్ ల బుకింగ్ కై చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర చార్జీలు చెల్లుబాటు అవుతాయని, రిషెడ్యూల్ సమయంలో వాటిని జమ చేయనున్నట్లు తెలిపారు.

లాక్ డౌన్ నిబందనల మినహాయింపు కార్యక్రమాలలో ధరణీ లావాదేవీలు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ధరణీ ద్వారా రిజిస్ట్రేషన్లకు కొనుగోలుదారు, అమ్మకం దారు తో పాటు ఇద్దరు సాక్షులు కలిపి మొత్తం నలుగురు వ్యక్తులైన హాజరు కావాల్సివుంటుందని తెలిపారు. తద్వారా మండల కార్యాలయాలలో రద్దీ పెరుగుతుందని, కోవిడ్ నిబందనలు అమలు సాద్యపడదని పేర్కొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article