ధరణి రూపమిది

52
DHARANI STRUCTURE
DHARANI STRUCTURE

DHARANI STRUCTURE

సులభంగా స్లాట్ బుకింగ్
కూర్చున్న చోటే అన్ని వివరాల నమోదు
వెరిఫికేషన్ నుంచి రిజిస్ర్టేషన్ దాకా అంతా ఆన్ లైన్
సామాన్యులకూ అర్థమయ్యేలా వెబ్ సైట్ రూపకల్పన
ఫొటోలు , బయోమెట్రిక్ వేలి ముద్రలతో పక్కా మార్పిడి
ప్రతి అంగుళం ధరణిలో నిక్షిప్తం

తెలంగాణ ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్ పారదర్శకత అనే అత్యుతన్న లక్ష్యానికి అనుగుణంగా రూపుదిద్దుకుంది. రాష్ర్ట చరిత్రలోనే విప్లవాత్మక అడుగులు వేస్తూ ఈ నెల 25న దసరకు ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సాంకేతికంగా ధరణి పోర్టల్ పూర్తిస్థాయిలో రెడీ అయ్యింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. వాటి ఫలితాలను బట్టి అవసరమైతే చిన్న చిన్న మార్పులు చేసుకొని దసరా నుంచి ప్రజలకు ధరణి అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ ఏమేం ఉంటాయి? స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి. తహశీల్దార్ కార్యాలయంలో లావాదేవీలు ఎలా పూర్తవుతాయి? ఏయే డాక్యుమెంట్స్ అవసరమవుతాయి?

పోర్టల్ లో మూడు భాగాలు
డాటా పోర్టల్
పిటిషనర్ పోర్టల్
డిపార్ట్ మెంట్ పోర్టల్

డాటా పోర్టల్ : ఇందులో రాష్ర్టంలోని అన్ని రకాల భూముల వివరాలు ఉంటాయి. వ్యవసాయ, వ్యవసాయేతర, అటవీ భూముల సమగ్ర సమాచారం ఇందులో లభిస్తుంది. ఈ పోర్టల్ ను ప్రజలకు అందుబాటులో తెస్తారని సమాచారం. తద్వారా ప్రపంచంలోని ఏ మూలన ఉన్నా భూమి వివరాలను తెలుసుకొనే అవకాశం ఉంది.

పిటిషనర్ పోర్టల్ : భూ యజమాని లేదా అమ్మకందారు, కొనుగోలుదారులు, వారసులు భూ లావాదేవీల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మొత్తం ఈ పోర్టల్ ఉంటుంది. ఈ విభాగంలో స్లాట్ బుకింగ్ నుంచి చలాన్ చెల్లించేవరకు ఆప్షన్లు ఉంటాయి.

డిపార్ట్ మెంట్ పోర్టల్: తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లు, ఇతర అధికారులకు మాత్రమే కనిపించే విభాగం ఇది. పిటిషన్ దారు చలాన్ చెల్లించిన తర్వాత దరఖాస్తు తహసీల్దార్ కార్యాలయానికి చేరినప్పటి నుంచి హక్కు పత్రాలు కొనుగోలుదారు లేదా వారసుల చేతికి వచ్చే వరకు ప్రక్రియ అంతా డిపార్ట్ మెంట్ పోర్టల్ లో జరుగుతుంది.

స్లాట్ ఇలా బుక్ చేసుకోవాలి..

ధరణి పోర్టల్ ను ఓపెన్ చేయగానే అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో అగ్రికల్చర్ పై క్లిక్ చేయాలి. తర్వాత వచ్చే పేజీలో ఆరు ఆప్షన్లు కనిపిస్తాయి.

అందులో మొదటి ఆప్షన్ స్లాట్ బుకింగ్ ఫర్ సిటిజన్ ఆప్షన్ ఎంచుకోవాలి. సిటిజన్ లాగిన్ పేజీలో మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే ఫోన్కు ఒక పాస్ వర్డ్ వస్తుంది. ఆ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత కింద గడుల్లో ఉన్న అంకెలు-అక్షరాలు(క్యాప్చా)ను ఎంటర్ చేయాలి.

తర్వాత గెట్ ఓటీపీ బటన్ క్లిక్ చేయాలి. వచ్చిన ఓటీపీ కింది ఇచ్చిన గడిలో నమోదు చేయాలి.

ఓటీపీని నమోదు చేయగానే సిటిజన్ డ్యాష్ బోర్డు పేజీ ఓపెన్ అవుతుంది.

ఇందులో ఏడు ఆప్షన్లు కనిపిస్తాయి. రిజిస్ర్టేషన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు మొదటి ఆప్షన్ అప్లికేషన్ ఫర్ రిజిస్ర్టేషన్ (సేల్ – గిఫ్ట్) ఎంపిక చేసుకోవాలి. వెంటనే పక్కన వచ్చే యువర్ అప్లికేషన్ ప్రీ రిజిస్ర్టేషన్ ఎంచుకోవాలి.

ప్రీ రిజిస్ట్రేషన్లో నేచర్ ఆఫ్ డీడీ, నేచర్ ఆఫ్ సబ్ డీడీ లలో మన లావాదేవీ ఏ రకమో (సేల్-గిఫ్ట్-పార్టిషన్) ఆప్షన్ ను ఎంచుకోవాలి. చివరగా పట్టదారు పాస్ బుక్ (పీపీబీ) నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఫెచ్ బటన్ క్లిక్ చేయాలి. పీపీబీ నంబర్ పై ఆస్తి వివరాలు కనిపిస్తాయి. జిల్లా, మండలం, గ్రామం, ఖాతా నంబర్, యాజమాని పేరు, తండ్రి పేరు లాంటి వివరాలు వస్తాయి. ఆ తర్వాత సదరు సర్వే నంబర్ లో ఉన్న సర్వే నంబర్లు, వాటి కింద ఎంత విస్తీర్ణంలో భూములు ఉన్నాయో వివరాలు కనిపిస్తాయి. ఈ భూముల్లో ఎంతమేరకు బదలాయించుకుంటున్నారో వివరాలు ఎంటర్ చేయాలి. ఒకేసారి ఒకటికి మించి సర్వే నంబర్లను ఎంపిక చేసుకోవచ్చు. చివరగా PROCEED ను క్లిక్ చేయాలి.

తర్వాత వచ్చే ఫోర్ బౌండరీ డీటెయిల్స్ లో అమ్మాల్సిన భూమికి నాలుగు దిక్కులా ఉన్న హద్దుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో విద్యా సంస్థ, అదర్స్, రైల్వే, రోడ్, సర్వే నంబర్, టెంపుల్ తదితర ఆప్షన్లు ఉంటాయి. ఒక్కొ దిక్కు ఏ హద్దు ఉన్నదో వివరాలను చేర్చాలి.

సెల్లర్ డీటెయిల్స్ పేజీలో పట్టాదార్ పాసుబక్ ఆధారాం అయినప్పటికీ నమోదు యజమాని (ఆధార్) తెలుగులో, లింగం, కులం, వంటి వివరాలు కనిపిస్తాయి.

అనంతరం ఆధార్ కార్డులో ఉన్న పేరు (ఇంగ్లిష్), రిలేషన్ టైప్, వయసు, ఏం చేస్తారు, ఫారం, 60/61ను సబ్ మిట్ చేశారా? అని అడుగుతుంది. ఒకవేళ చేయకపోతే పాన్ కార్డు నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత భూ యజమాని ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి పూర్తి చిరునామాను నమోదు చేయాలి. ఆ తర్వాత భూ యజమాని నివసిస్తున్న ఇంటి పూర్తి చిరునామాను నమోదు చేయాలి. చివరగా సేవ్ అండ్ కంటిన్యూ బటన్ క్లిక్ చేయాలి.

కొనుగోలు చేసే వ్యక్తి వివరాలను నింపాలి. ఇప్పటికే పట్టాదార్ పాస్ బుక్ ఉంటే ఆ వివరాలు నమోదు చేయాలి. దీంతో ఆ వ్యక్తి పూర్తి వివరాలు ప్రత్యక్షం మవుతాయి. ఆ తర్వాత అన్ని వివరాలు నింపాలి. ఒకవేళ పట్టాదార్ పాస్ బుక్ లేదని ఎంపిక చేసుకుంటే అక్కడ కనిపించే అన్ని రకాల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

PAGE AND TRANSACTION SUMMARY పేజీలో TRANSACTION సమ్మరీ రిసిప్ట్ ను క్లిక్ చేస్తే ఇప్పటి వరకు మనం నమోదు చేసిన అన్ని రకాల వివరాలు అందులో కనిపిస్తాయి. భూ లావాదేవీకి సంబంధించి ఎంత చెల్లించాలో కూడా కనిపిస్తుంది. వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత ఎస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ప్రోసిడ్ టు పేమెంట్ ను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ తప్పుగా నమోదు అయితే వెనక్కి వెళ్లి మరోసారి వివరాలు నమోదు చేయాలి. చలాన్ పేజీలో డబ్బు ఎవరు కడతారు? సెల్లర్, బయ్యర్, ఇతరులు ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. వెంటనే అయినప్పటికీ మనం ఎంటర్ చేసిన సెల్లర్/బయ్యర్ వివరాలు కనిపిస్తాయి. ఎంత మొత్తం చెల్లించాలో అందులో వివరాలన్నీ కనిపిస్తాయి. ఒకసారి సరిచూసుకోని జనరేట్ చలాన్ ఆప్షన్ ఎంపిక చేయాలి.

DHARANI PORTAL UPDATES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here