10వేల పరుగుల క్లబ్ లోకి ధోనీ

Dhoni Reached Ten thousand Runs mile stone

  • ఆ ఘనత సాధించిన ఐదో భారతీయుడిగా గుర్తింపు

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ మరో ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్న అతి తక్కువ మంది బ్యాట్స్ మెన్ జాబితాలో ధోనీ కూడా చేరాడు. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. 2017లో ఇంగ్లాండ్‌ టూర్‌లో ఆడిన ధోని 10వేల పరుగుల మైలురాయికి కేవలం ఒక్క పరుగు దూరంలో ఆగిపోయాడు. ఈ నేపథ్యంలో శనివారం సిడ్నీ వేదికగా జరిగిన వన్డేలో 51 పరుగులు చేసిన ధోనీ 10వేల పరుగులు చేసిన భారత ఆటగాళ్లు సచిన్‌, సౌరభ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, విరాట్‌ కోహ్లీల సరసన చేరాడు. ఆసీస్‌ పేసర్‌ రిచర్డ్ సన్  బౌలింగ్‌లో సింగిల్‌ తీయడం ద్వారా పదివేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇది ధోనీ ఆడిన 333 వన్డే కావడం విశేషం. ప్రపంచ వన్డే క్రికెట్‌ చరిత్రలో మొత్తం13మంది ఆటగాళ్లు మాత్రమే 10వేల పరుగుల మార్కును దాటారు. వీరిలో సచిన్‌, కుమార సంగక్కర, రికీ పాంటింగ్‌, జయసూర్య, జయవర్దనే, ఇంజిమామ్‌ ఉల్‌ హక్‌, జాక్వస్‌ కలిస్‌, సౌరభ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, బ్రియన్‌ లారా, తిలకరతనె దిల్షాన్‌లు ఉన్నారు.

Check out MS DHONI Signed Bat CLICK HERE

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article