సీపీఐలో భిన్నాభిప్రాయాలు …ఏం జరిగిందంటే

141
Diffrences In CPI Over AP Capital
Diffrences In CPI Over AP Capital

Diffrences In CPI Over AP Capital

ఏపీ రాజధాని రగడ పార్టీల్లోనూ చిచ్చు పెడుతుంది. రాజధాని అంశంపై బీజేపీలోనే కాదు సీపీఐలోనూ అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన అనంతరం దాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ కూడా టీడీపీ బాటలో నడుస్తున్న విషయం తెలిసిందే. అమరావతికి అనుకూలంగా  నిర్ణయం తీసుకుని ఆ దిశగా పోరాటం చేస్తుంది సీపీఐ . ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళనల్లో చంద్రబాబుతో కలిసి అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కర్నూలు నేతలు అధికార పార్టీ మూడు రాజధానుల అంశానికి జై కొట్టడం సంచలనమైంది. ఈరోజు సమావేశమైన ఆ పార్టీ జిల్లా నేతలు అధికార వికేంద్రీకరణకు అనుకూలంగా తీర్మానం చేయడమేకాక, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీరును వ్యతిరేకించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా హెూదా కోసం విద్యార్ధులు ఉద్యమిస్తే కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతిని తాత్కాలిక రాజధానిగా మార్చింది చంద్రబాబేనని ధ్వజమెత్తారు. దీంతో ఇప్పుడు సీపీఐ లో రాజధాని విషయంలో రేగిన చిచ్చు పార్టీని ఏం చేస్తుందో అన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది.

Diffrences In CPI Over AP Capital,Andhra pradesh, capital amaravati,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here