టీటీడీ సభ్యుడిగా దిల్ రాజు?

DIL RAJU AS TTD MEMBER?

  • టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిఫార్సు
  • ఆమోదం తెలిపిన సీఎం జగన్
  • త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కు అవకాశం వచ్చినట్టు సమాచారం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిఫార్సు చేయడంతో ఏసీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంగీకరించినట్టు తెలిసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ హయాంలో నియమితులైన టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఇతర సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. తొలుత ఇద్దరు సభ్యులు రాజీనామా చేసినా, పుట్టా మాత్రం రాజీనామా చేయనని తెగేసి చెప్పారు. ప్రభుత్వం తమ నియామకాలు రద్దు చేసేవరకు కొనసాగుతానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు రద్దు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పుట్టా వెనక్కి తగ్గి తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే టీటీడీ చైర్మన్ గా ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన శనివారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు కూడా స్వీకరించారు. ఈ నేపథ్యంలో బోర్డు సభ్యులను కూడా నియమించాలని సర్కారు నిర్ణయించింది. తెలంగాణ నుంచి టీటీడీ బోర్డులో ఒకరికి అవకాశం ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి ఆ అవకాశం నిర్మాత దిల్ రాజుకు ఇవ్వాలని కేటీఆర్ సిఫార్సు చేశారు. ఇందుకు జగన్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

GENERAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article