దిల్ రాజు సిబ్బందికి ఫన్ అండ్ ఫన్

DIL RAJU SURPRISE GIFT

  • బ్యాంకాక్ టూర్ పంపిస్తున్న ఎఫ్2 నిర్మాత

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తన సిబ్బందికి ఎఫ్2 చూపించబోతున్నారు. ఇక్కడ ఎఫ్2 అంటూ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కాదు.. ఫన్ అండ్ ఫన్ మాత్రమే. తన దగ్గర పనిచేస్తున్న 20 మంది సిబ్బందిని వినోదం కోసం బ్యాంకాక్ టూర్ పంపిస్తున్నారు. విక్టర్ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 సినిమా ఈ సంక్రాంతికి విడుదలై భారీ విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ భారీగా వసూళ్లు సాధించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం ఏకంగా 60 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఇటీవల కాలంలో దిల్ రాజు బ్యానర్ లో అత్యధిక లాభాలు దక్కించుకున్న చిత్రం ఇదే. ఈ ఆనందాన్ని తన సిబ్బందితో షేర్ చేసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. తన దగ్గర పనిచేస్తున్న 20 మంది కీలకమైన ఉద్యోగులను బ్యాంకాక్ టూర్ కు పంపిస్తున్నారు. దిల్ రాజు తన స్టాప్ కు ఇలాంటి సర్ ప్రైజ్ లు ఇవ్వడం కొత్తేం కాదు. ప్రతి సంవత్సరం బోనస్ లు ఇవ్వడంతోపాటు సినిమా సక్సెస్ అయితే చిన్న చిన్న బహుమతులు ఇస్తుంటారు. ఈసారి ఆయన సిబ్బంది ఏకంగా బ్యాంకాక్ టూర్ అనే సర్ ప్రైజ్ గిఫ్ట్ కొట్టేశారు.

TELUGU CINEMA

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article