DILRAJU SERIOUS ON PETA PRODUCER
`పేట` నిర్మాతకు దిల్‌రాజు కౌంటర్ సూపర్‌స్టార్ రజనీకాంత్ పేట సినిమాను తెలుగులో విడుదల చేస్తోన్న నిర్మాత అశోక్ వల్లభనేని నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అల్లు అరవింద్, దిల్‌రాజు, యు.వి.క్రియేషన్స్‌ను కుక్కలు.. నయూంను ఎన్‌కౌంటర్ చేసినట్లు చేయాలని వివాదస్పదంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. దానికి ప్రతిగా దిల్‌రాజు సదరు నిర్మాతకు కౌంటర్ ఇచ్చాడు. “మూడు పెద్ద తెలుగు సినిమాలు విడుదలవుతుంటే అనువాద చిత్రానికి థియేటర్స్ దొరుకుతాయని ఎలా అనుకుంటారు. తెలుగు సినిమాలకే థియేటర్స్ దొరకని పరిస్థితి నెలకొంది. 18 నుండి థియేటర్స్‌లో పేట సినిమా మాత్రమే ఉంటుందని అంటున్నారు. మరి వారి సినిమాను ఆరోజే రిలీజ్ చేసుకోవచ్చు కదా.. తెలుగు సినిమాల విడుదల తేదీలను ఆరు నెలల ముందుగానే ప్రకటించారు. పదిహేను, నెల ముందు సినిమాను కొనుక్కొని రిలీజ్ డేట్ ప్రకటిచేసుకున్నారు. ఇదే నిర్మాత నాలుగు నెల్లలో నవాబ్, సర్కార్ సినిమాలను కూడా విడుదల చేశారు. ఇందులో సర్కార్ సినిమాను కావాల్సినన్ని థియేటర్స్‌లో విడుదల చేసుకున్నారు కదా. అప్పుడేం మాట్లాడలేదు. ఇలాంటి సీజన్స్‌లో తెలుగు సినిమాలను కాదని వేరే సినిమాలకు థియేటర్స్ ఇవ్వడం కష్టమే` అన్నారు దిల్‌రాజు.
పేట నిర్మాతపై దిల్‌రాజు సీరియస్
