దిల్ రాజు కేజీఎఫ్-2 కొనలేదా?

5
#DilRajuKgf2Movie
#DilRajuKgf2Movie

#DilRajuKgf2Movie

కేజీఎఫ్ -2 సినిమాకు సంబంధించి రెండు రాష్ట్రాల హక్కుల్ని దిల్ రాజు రూ. 65 కోట్లు పెట్టి కొనుగోలు చేశారనే వార్త వాట్సపుల్లో తిరుగుతోంది. వాస్తవానికి, ఈ సినిమాను విడుదల చేయడానికి స్వయంగా కేజీఎఫ్ నిర్మాతలే డిస్ట్రిబ్యూటర్లను ఎంచుకుంటున్నారనే విషయం చాలామందికి తెలియదు. అంటే, మూవీ రిలీజ్ బై ఇన్విటేషన్ అన్నమాట. వినడానికీ వింతగా ఉన్నప్పటికీ ఇది వంద శాతం వాస్తవమే. ఇప్పటికే కేజీఎఫ్ 2 నిర్మాతలే స్వయంగా డిస్ట్రిబ్యూటర్లను ఎంచుకుని సినిమాను అందజేస్తున్నారు. ఒక్కో ఏరియాను ఊహించిన దానికంటే అధిక మొత్తానికి సినిమాను విక్రయిస్తున్నారని సమాచారం. సినిమా ఫలితంలో ఏమాత్రం తేడా వచ్చినా నిర్మాతలు అందుకు తగ్గట్టు సర్దుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది.

కేజీఎఫ్ 2 సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి మొత్తం దిల్ రాజు కొనుగోలు చేశారనేది ఫేక్ న్యూస్ అని సమాచారం. దిల్ రాజు కేవలం నైజాంకు సంబంధించిన హక్కుల్ని అధిక మొత్తం వెచ్చించి కొన్నారట. అంతేతప్ప, ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసేందుకు కొనలేదని తెలిసింది. ఆంధ్రలో ఏరియాల వారీగా ఈ సినిమాను వివిధ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా విడుదల అవుతున్నదని సమాచారం. మరి, కేజీఎఫ్ -2 సినిమాను ఏయే ఏరియాల్లో ఎవరెవరు రిలీజ్ చేస్తున్నారనే విషయాన్ని చిత్ర నిర్మాతలు ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.

#KGF2LatestNews