Saturday, April 5, 2025

పోలీసు సిబ్బందిపై విశ్వాసాన్ని పెంపొందించాలి

డయల్ 100 /112 పనితీరుపై డిజిపి వీడియో కాన్ఫరెన్స్
పోలీసు సిబ్బంది పై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో నైపుణ్యం.. స్పందనలో అత్యున్నత ప్రమాణాలను పాటించాలని డిజిపి డాక్టర్ జితేందర్ సూచించారు. డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ డయల్ 100/112 పనితీరుపై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ శాంతి భద్రతలు కాపాడటంలో, త్వరితగతిన పోలీసు సిబ్బంది స్పందించడంలో డయల్ 100, డయల్ 112 కీలక పాత్ర అని చెప్పారు. డయల్ 100 /112హెల్ప్‌లైన్ ద్వారా వచ్చిన కాల్స్ పై సత్వర, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని డిజిపి స్పష్టం చేశారు. అదనపు డిజిపి లు మహేష్ ఎం భగవత్ , వి.వి. శ్రీనివాసరావు, ఐజిపీలు ఎం. రమేష్, వి.సత్యనారాయణ, హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ పరిమళ హన నూతన్ ఇతర పోలీసు అధికారులు హాజరై డయల్ 100 /112 సర్వీస్‌ను మెరుగుపరచడం కోసం విలువైన సూచనలు, సలహాలు అందించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com