Director Krishtrying to Create a sensation
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ `యన్.టి.ఆర్` ను తెరకెక్కించిన దర్శకుడు జాగర్లమూడి క్రిష్. ఇప్పుడు మరో చరిత్రకు శ్రీకారం చుడుతున్నాడు. ఆ చరిత్ర ఎవరిదో కాదు రాజరాజచోళుడుకి సంబంధించింది. మరో విషయమేమంటే ఇది వెబ్ సిరీస్‌గా తెరకెక్కనుంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన రచన జరుగుతుంది. ఆరుభాగాల ఈ వెబ్‌సిరీస్‌ను క్రిష్ నిర్మిస్తుంటే భాషా, మాస్టర్ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సురేష్ కృష్ణ తెరకెక్కిస్తున్నాడట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఆసక్తికరమైన విషయమేమంటే తమిళంలో ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. తర్వాత క్రిష్ ఈ వెబ్ సిరీస్‌ను తెలుగులోకి అనువదించాలనుకుంటున్నారట.