ఆ దర్శకుడికి మళ్లీ రష్మికనే కావాలట!

Director Parshuram Again Works With Rashmika

రష్మిక మందన్నా.. ఛలోతో పరిచయం అయిన తర్వాత తను మీడియం రేంజ్ వరకూ ఆగుతుందేమో అనుకున్నారు చాలామంది. కానీ తను మాత్రం ఓ రేంజ్ లో టాప్ రేస్ లోకి వెళ్లిపోయింది. ఏకంగా మహేష్ బాబు సరసనే ఆఫర్ కొట్టేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలోనూ నటిస్తోంది. మరోవైపు నితిన్ సరసన నటించిన భీష్మ ఈ నెల 21న విడుదల కాబోతోంది. ఇప్పటి వరకూ వచ్చిన టీజర్, సాంగ్స్ చూస్తోంటే మరోసారి రష్మిక సినిమాలో తనే డామినేటింగ్ గా కనిపిస్తుందేమో అనిపిస్తుంది. అయితే ఈ మూవీ దర్శకుడు వెంకీ కుడుముల ఫస్ట్ మూవీతోనే పరిచయమైన రష్మికను తన రెండో సినిమాకూ రిపీట్ చేసి ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ హీరోయిన్నే కావాలని వెంకీ నిర్మాణ సంస్థను ఒప్పించి మరీ తీసుకున్నాడు. ఇప్పుడు అలాగే మరో దర్శకుడు కూడా చేస్తున్నాడు.

గీతగోవిందంతో వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది రష్మిక. తను టాప్ లీగ్ లోకి వెళ్లడానికి కారణం ఈ సినిమానే. అయితే ఈ మూవీ హీరో, హీరోయిన్లకు ఉపయోపడ్డట్టుగా దర్శకుడుకి యూజ్ కాలేదు. లేదా తనే చేసుకోలేదు. మొత్తంగా గీత గోవిందంతో ఆకట్టుకున్న పరశురామ్ రెమ్యూనరేషన్ కోసం పట్టుబట్టి రెండేళ్లు వేస్ట్ చేసుకున్నాడు. రీసెంట్ గా నాగ చైతన్యతో సినిమా ఓకే అయింది. అయితే తన వంద కోట్ల క్లబ్లో ఉన్న రష్మికనే ఈ చిత్రంలోనూ హీరోయిన్ గా తీసుకుంటున్నాడు. యస్.. చైతన్య సరసన రష్మికనే రొమాన్స్ చేయబోతోంది.

మొత్తంగా ఆయా దర్శకులను రష్మిక తన నటనతో ఆకట్టుకోవడంతోనే తనను వాళ్లు రిపీట్ చేస్తున్నారు అనుకోవచ్చు. అలాగే ఈ సినిమాకు చైతన్య, రష్మికల పెయిర్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఇది కూడా రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామానే అంటున్నారు. మరి ఈ మూవీతో ఈ జంటను ఏ క్లబ్ లో చేరుస్తాడో పరశురామ్..

Director Parshuram Again Works With Rashmika,Naga Chaitanya-Parshuram’s movie

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article