Director Ready for one more Experiment
సబ్‌మెరైన్ కాన్సెప్ట్‌తో `ఘాజి ది ఎటాక్` పేరుతో సినిమా చేసి ఇండియన్ సినిమాల్లోనే తొలి సబ్‌మెరైన్ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. గత ఏడాది తొలి స్పేస్ టాలీవుడ్ మూవీ `అంతరిక్షం 9000 kmph`ని తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రం పెద్దగా విజయాన్ని సాధించలేదు. ఇప్పుడు మూడో సినిమా కోసం సిద్ధమవుతున్నాడట సంకల్ప్. ఆసక్తికరమైన విషయమేమంటే ఈసారి కూడా మరో ఎక్స్‌పెరిమెంటల్ సినిమానే డైరెక్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాడట. అంటార్కిటికాలోని రీసెర్చ్ సెంటర్‌ను బేస్ చేసుకుని సంకల్ప్ కథను సిద్ధం చేసుకుంటున్నాడని సమాచారం.