గ్రీన్ చాలెంజ్ లో శేఖర్ కమ్ముల

62
Director Shekar kammula join in Green Challenge
Director Shekar kammula join in Green Challenge

Director Shekar kammula join in Green Challenge

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశమంతా విస్తరించింది. ప్రతిరోజు ఎవరో ఒక్కరు మొక్క నాటుతూనే ఉన్నారు. తాజాగా ఈ ఛాలెంజ్‌లో సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల పాల్గొని మొక్కలు నాటారు. ‘లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్‌ జరుగుతున్న మొయినాబాద్ మండలం, కనకమామిడి గ్రామంలో రహదారికి ఇరువైపులా ఆయన మొక్కలు నాటి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారు. దేశాన్ని పచ్చదనంగా మార్చేందుకు ఆయన తలపెట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మహోన్నతమైనదని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలాని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని, లవ్ స్టోరీ టీం గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని మొక్కలు నాటాలని శేఖర్ కమ్ముల కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here