నితిన్ కు షాక్ ఇచ్చిన డైరెక్టర్

Director Sudheer Varma Left From Nithin Movie

టాలీవుడ్ యంగ్ స్టార్స్ లో ఒకడైన నితిన్ .. ఈ యేడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండబోతున్నాడు. అతని లేటెస్ట్ మూవీ భీష్మ ఈ నెల 21న విడుదల కాబోతోంది. అలాగే వెంకీ అట్లూరి డైరెక్షన్ లో కీర్తి సురేష్ హీరోగా నటిస్తోన్న ‘రంగ్ దే’షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు చంద్రశేఖర్ ఏలేటి తో చేస్తోన్న ‘చెక్’(లేదా చదరంగం) అనే సినిమా కూడా ఇప్పటికే సగం వరకూ షూటింగ్ అయిపోయిందంటున్నారు. వీటితో పాటు బాలీవుడ్ లో హిట్ అయిన అంధాదూన్ రీమేక్ రైట్స్ ను కూడా తీసుకున్నాడు. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు అని వినిపించింది. ఆల్రెడీ సుధీర్ కూడా స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడనే వార్తలు కొన్నాళ్ల క్రితం కంటిన్యూస్ గా వచ్చాయి. మరి ఏమైందో కానీ సుధీర్ వర్మ సడెన్ గా సురేష్ బాబు క్యాంప్ లో చేరిపోయాడు. అక్కడ కూడా ఓ కొరియన్ సినిమాను రీమేక్ చేయడానికే వెళ్లాడట. అదో క్రైమ్ థ్రిల్లర్. సురేష్ బాబుకోసం వెళ్లాడా లేక నితిన్ తో సరిపడక వెళ్లాడా అనేది తెలియదు కానీ.. ఇప్పుడీ మూవీని ఎక్స్ ప్రెస్ డైరెక్టర్ చేతిలో పెట్టారనే వార్తలు వస్తున్నాయి.

ఫస్ట్ మూవీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ కొట్టి.. తర్వాత ఎక్స్ ప్రెస్ రాజా అంటూ మరో విజయం అందుకున్న మేర్లపాక గాంధీకి అంధాదూన్ రీమేక్ బాధ్యతలు ఇచ్చినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్ శ్రేష్టలోనే నిర్మించబోతున్నారు. ఇక నానితో కృష్ణార్జున యుద్ధం తీసి ఫ్లాప్ అందుకున్న మేర్లపాకకు ఆ తర్వాత మరో హీరో ఛాన్స్ ఇవ్వలేదు. మరి ఇదే నిజమైతే అతనికి మరో మంచి అవకాశం వచ్చినట్టే.

Director Sudheer Varma Left From Nithin Movie,#SudheerVarma, Nithin

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article