Dirty politician remarks made by KCR
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికారంపక్షం, ప్రతిపక్షం ఎవరికి వారు విమర్శలు చేసుకుంటున్నారు. నిన్న సోమవారం మూడు రాజధానుల అంశంతో అసెంబ్లీ అట్టుడికిపోయింది. ఏపీకి మూడు రాజధానులు కావాలని అప్పుడే అభివ్రుద్ధి వికేంద్రీకరణ జరుగుతుందంటూ వైసీపీ అంటుంటే..లేదు లేదు మూడు రాజధానులు ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావంటూ టీడీపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు మూడు రాజధానుల అంశంపై చర్చ హీట్ పుట్టించింది. అయితే ఎట్టకేలకు త్రీ క్యాపిటల్స్ నిర్ణయిస్తూ వైసీపీ గవర్నమెంట్ బిల్లు పాస్ చేసింది. ఇకపోతే నేడు రెండవరోజు కూడా అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లును ప్రవేశపెడితే.. దానికి టీడీపీ అడ్డుపడటం దారుణమన్నారు. ప్రతీ విషయంపై టీడీపీ గొడవ చేస్తోందని రోజా అన్నారు. మహిళలను కూడా టీడీపీ సభ్యులు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, అసలు వారికి జ్ఞానం ఉందా అని రోజా ప్రశ్నించారు. అదేవిధంగా గతాన్ని గుర్తు చేస్తూ రోజా చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాబుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు. చంద్రబాబును డర్టీ పొలిటీషియన్ అని కేసీఆర్ విమర్శించిన సంగతిని మరచిపోయారా అని రోజా ఎద్దేవా చేశారు.