డిస్కోరాజా కూడా షాక్ ఇచ్చిందిగా ..?

Disco Raja Movie Public Talk

మాస్ మహరాజ్ గా అభిమానుల్లో తిరుగులేని పేరు తెచ్చుకున్నాడు రవితేజ. కానీ ఏ ఇమేజ్ తో ఫేమ్ అయ్యాడో ఆ ఇమేజ్ వల్లే ఇప్పుడు ఫేడవుట్ అయ్యేలా కనిపిస్తున్నాడు. కథ ఏదైనా తన ఇమేజే ఇంపార్టెంట్ అనుకునే రవితేజ.. చాన్నాళ్లుగా ఆ ఇమేజ్ తోనే మొనాటనస్ గా మారాడు. దీంతో అన్ని సినిమాలూ ఒకేలా కనిపిస్తున్నాయి. పైగా ఇప్పుడు టాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. ఇక ఈ శుక్రవారం విడుదలైన డిస్కోరాజా పరిస్థితి కూడా అదే అంటున్నారు. టీజర్స్ చూసినప్పుడు డిస్కోరాజాతో మాస్ రాజా మారాడు అనుకున్నారు చాలామంది. కానీ సినిమా చూస్తే కానీ తెలియలేదు. అతను మారలేదని. ఓ రకంగా ఇది మంచి సైన్స్ ఫిక్షన్ సినిమా అయ్యేదే. కానీ రవితేజ ఇమేజ్ కోసం చేసిన మార్పులు, చేర్పులు మరోసారి అతన్నుంచి మొనాటనస్ మూవీగా మిగిల్చింది.

1980ల నేపథ్యంతో పాటు నేటి కాలానికి లింక్ వేస్తూ దానికి సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ గా రూపొందిన ఈ మూవీని కాస్త శ్రద్ధగా చేస్తే మంచి సినిమానే అయ్యేది. కానీ మొదటి సగం బానే ఉన్నా.. సెకండ్ హాఫ్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అలాగే హీరోయిన్లకు పెద్దగా ప్రియారిటీ లేదు. తమన్ నేపథ్య సంగీతం అద్భుతమైనా.. అందుకు తగ్గ సన్నివేశ బలం లేక చతికిల పడ్డాడీ డిస్కోరాజా. మొత్తంగా రవితేజకు సింగిల్ రిలీజ్ అయినా.. డిస్కోరాజా ఏ మాత్రం మెప్పించలేకపోయాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి కమర్షియల్ గా ఎలాంటి ప్రాఫిట్స్ తెస్తుందో చూడాలి.

Disco Raja Movie Public Talk,Ravi Teja,Is Disco Raja Breaks To Ravi Teja?,What About Disco Raja,Disco Raja Minus Points,#Raviteja, #DiscoRaja Movie Review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *