డిస్కో రాజా తెలుగు రివ్యూ…

Disco Raja Telugu Movie Review

టైటిల్‌: డిస్కో రాజా
జానర్‌: సైన్స్‌ఫిక్షన్‌ అండ్‌ రివేంజ్‌ డ్రామా
నటీనటులు: రవితేజ, నభా నటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, తాన్యా హోప్‌, బాబీ సింహా, వెన్నెల కిశోర్‌, సునీల్‌, సత్య
సంగీతం: తమన్‌
దర్శకత్వం: వీఐ ఆనంద్‌
నిర్మాత: రజని తాళ్లూరి, రామ్‌ తాళ్లూరి

ర‌వితేజ అంటేనే మాస్ ఎనర్జీ. ఆయ‌న న‌ట‌న‌తోనే స‌గం సినిమా కానించేస్తాడు. ఇక ఆయ‌న ఆడియ‌న్స్‌ని క‌ట్టిప‌డేయ‌డంలో దిట్ట‌. యాక్షన్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేయడం ఆయనకే సాధ్యం.. అయితే, గత మూడేళ్ళలో రవితేజ నుండి ఒక్క ప్రామిసింగ్ సినిమా కూడా రాలేదు. వ‌రుస ప‌రాజ‌యాలే ఆయ‌న‌ను త‌ట్టాయి. ఇక మంచి కాంబో అనుకున్న శ్రీనువైట్ల అమ‌ర్ అక్బ‌ర్ అంటోనీ కూడా దారుణంగా ప్లాప్ అయింది. ఇక ర‌వితేజ్ త‌న రొటీన్ జోన‌ర్ ప‌క్క‌న‌పెట్టి సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో మ‌న‌ముందుకు వ‌చ్చాడు. ర‌వితేజ తాజా చిత్రం డిస్కో రాజా నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది..క‌థేంటి..హిట్టా..ఫ‌ట్టా అనేది చూద్దాం…

డిస్కో రాజా క‌థ‌….టాలీవుడ్‌లో సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాలంటే కత్తిమీదసాము వంటిది. ఎందుకంటే లాజిక్‌ మిస్సయినా, ప్రేక్షకుడికి అర్థంకాకపోయినా డైరెక్టర్‌ ఫెయిల్‌ అయినట్టే. మ‌రి డిస్కోరాజా క‌థ విష‌యానికి వ‌స్తే… సైన్స్ ల్యాబ్ లో జరిగే ఒక ప్రయోగం వల్ల బ్రెయిన్ డెడ్ పెర్సన్ వాసు (రవితేజ) మాములు మనిషవుతాడు. అయితే తన గతం మొత్తం మర్చిపోతాడు. తనెవరో తెలుసుకునే క్రమంలో ఎంపీతో గొడవ పెట్టుకుంటాడు. దానివల్ల వాసు ఫేమస్ అయ్యి తన వాళ్ళను చూడగలుగుతాడు. అంతే కాకుండా చెన్నై నుండి సేతు (బాబీ సింహా) డిస్కో రాజ్ (రవితేజ)కు వాసుకు సంబంధం ఉందనుకుని వెతుక్కుంటూ వస్తాడు. ఇంతకీ వాసు మీద జరిగిన ప్రయోగం వల్ల వాసు బాడీకి ఏం జరుగుతుంది? సేతు ఎవరు? డిస్కో రాజ్ కు వాసుకు ఉన్న సంబంధమేంటి? వాసు కు డిస్కో రాజ్ కు ఉన్న గొడవలేంటి? బర్మా సేతు (బాబీ సింహా), హెలెన్‌ (పాయల్‌ రాజ్‌పుత్‌), భరణి (రామ్‌కీ), పీటర్‌ (సత్య), ఉత్తరకుమారా అలియాస్‌ దాస్‌ (సునీల్‌)లు ఈ కథలో ఎందుకు ఎంటర్‌ అవుతారు? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.

డిస్కో రాజా ఎలా ఉంది డిస్కో రాజా మొదలుపెట్టిన విధానం, ఆ తర్వాత ల్యాబ్ లో చేసిన ప్రయోగం, ఆపై ఇంటర్వెల్ కు ముందు డిస్కో రాజ్ పాత్ర పరిచయం.. ఇలా చకచకా సాగిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో కూడా ఫ్రేమ్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ క్రిప్స్ గా ఉంది. ఫైట్స్ ఓకే. కథ విభిన్నంగా మొదలైనా తర్వాత రెగ్యులర్ రివెంజ్ డ్రామా రూట్ తీసుకుంటుంది. వీఐ ఆనంద్ దర్శకత్వం కూడా మిక్స్డ్ ఫీలింగ్స్ కలిగిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుండటంతో సెకండాఫ్‌పై మరింత ఆసక్తి పెరిగిపోయింది..

ఇక నటీనటుల విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై నడిపించారు రవితేజ. మాస్ మహారాజాలోని ఫైర్‌ను మరోసారి మనం తెరపై చూడొచ్చు. రవితేజ అభిమానులకు అయితే కన్నులపండువలా ఉంటుంది. ఎనర్జీతో పాటు స్టైలిష్‌గా కూడా కనిపించారు రవితేజ. హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. నభా నటేష్ పాత్ర అయితే ఎందుకు అనిపిస్తుంది. పాయల్ రాజ్‌పుత్ పాత్ర కొంతలో కొంత నయం. మూగ అమ్మాయిగా చక్కగా నటించింది. ఇక తాన్య హోప్ డాక్టర్ పాత్రలో మెప్పించింది.

రివ్యూ..ర‌వితేజ లేక‌పోదే డిస్కోరాజా లేదు

Disco Raja Telugu Movie Review,Ravi Teja Disco Raja,VI Aanand Disco Raja Rating,Disco Raja Review And Rating,Tollywood Latest Movies Reviews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *