అర్తమూరు గ్రామంలోఉద్రిక్తత దళితులపై వివక్షత..

 • అర్తమూరు గ్రామంలోఉద్రిక్తత
  *దళితులపై వివక్షత..
  *పంచాయితీ ముందే మృతదేహంతో ర్యాలీ
  *మండపేట రామచంద్రపురం రోడ్డుపై బైఠాయింపు
  *జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని దళితుల వెల్లడి
  అమలాపురం:కోనసీమ జిల్లా మండపేట మండలం అర్తమూరులో దళితుల శ్మశాన వాటిక అంశం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. గ్రామానికి చెందిన ఓ దళిత వృద్ధుడు మృతి చెందితే ఖననం చేసేందుకు జాగా లేకపోవడం పై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రెండో రోజు కూడా అర్తమూరు పంచాయితీ కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద వృద్ధుడి శవాన్ని ఉంచి అంత్య క్రియలకు స్థలం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. దళితులపై మండల స్థాయి అధికారులు వివక్షత చూపిస్తున్నారంటూ దళిత యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ర వర్ణాలకు పంచాయితీ, రెవెన్యూ అధికారులు కొమ్ము కాస్తూ ఎస్సీలను హేళన చేస్తున్నారని వాపోతున్నారు. మాకు న్యాయం జరగాలని రామచంద్రపురం మండపేట మెయిన్ రోడ్డు పై బైఠాయించారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article