ఆర్టీసీ కార్మికులతో ఇప్పటికైనా చర్చలు జరపండి

Discuss with RTC workers today

సీఎం కేసీఆర్ మొండి పట్టుదల వీడి చర్చలు జరపాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి సీఎం కేసీఆర్ ను కోరారు. ఆర్టీసీ కార్మికులెవరూ కేసీఆర్ ప్రకటనతో భయపడొద్దన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే అధికారం సీఎం కేసీఆర్ కు లేదన్నారు. సీఎం పిలుపునిచ్చినా ఒక్క శాతం కార్మికులు కూడా విధుల్లో చేరలేదన్నారు. కార్మికులంతా ఐక్యంగా ఉన్నారని… సమ్మెకు సహకరించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం అనుకూలంగా స్పందించి చర్చల ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలన్నారు అశ్వత్థామరెడ్డి.అంతకు ముందు హైదరాబాద్  బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, టీజేఏసీ  కోదండరాం,ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ,అశ్వత్థామరెడ్డి కలిశారు. సమ్మె భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
tags :  tsrtc strike, rtc strike, rtc jac, telangana government,  court, CM KCR , RTC MD, Sunil sharma, Ashwatthama reddy

603 క్వింటాళ్ల ఉల్లిపాయలను  సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు

విజయారెడ్డి సజీవదహనం ఘటన మరువకముందే మరో ఘటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *